Labels

APSF

Monday 7 February 2022

విద్యార్థి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. APSF రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర www.apsf.in

 విద్యార్థి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. APSF రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర

ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నేడు అనంతపురం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ముట్టడి.

నేడు నగరంలో ఆర్ట్స్ కళాశాల నుండి టవర్ క్లాక్ మీదుగా కోర్ట్ రోడ్డు ఉపాధి కల్పన కార్యాలయం వరకు ర్యాలీ నిరసన అనంతరం ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏపీ ఎస్ ఎఫ్ APSF రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర  మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ను నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు. డిగ్రీ పీజీ బీటెక్ ఎంటెక్ పట్టాలు ఒక చేత పట్టుకుని మరో చేత్తో విద్యార్థి యువత పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కల్పన కల్పించడంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేవలం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ద్వారా వాచ్ మెన్, సెక్యూరిటీ గార్డులు భర్తీ చేస్తున్నారు తప్ప ఏపీపీఎస్సీ ప్రకారం గ్రూప్స్ ఉద్యోగాలు , టీచర్ ఉద్యోగాలు, వైద్య పోలీసు ఉద్యోగాలు, యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు గాని నియామకం చేపట్టలేదు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి మూడు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో  Nsui రాష్ట్ర కార్యదర్శి నరేష్్ జిల్లా అధ్యక్షులు సురేష్, కార్యదర్శి వినయ్, NSUI జిల్లా అధ్యక్షులు ఓబులేసు కార్యదర్శి దాదు,గిరి APSF నాయకులు రామ్ నాయక్ ,ప్రకాష్, శేఖర్ పాల్గొన్నారు.













No comments:

Post a Comment

Blogger Gadgets